టైమ్-లాప్స్ ఇంక్యుబేషన్ అంటే ఏమిటి?

టెక్నాలజీ ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందింది. సంతాన సాఫల్యత రంగంలో కూడా అధునాతన టెక్నాలజీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల ఫెర్టిలిటీ వైద్య చరిత్రలో టెక్నాలజీ పరంగా రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారు ఒక అడుగు ముందుకు వేశారు. ఈ టైం లాప్స్ అనే టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పిండాన్ని మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు వీడియో ద్వారా చూడొచ్చు.


IVFలో, శిశువుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న పిండాలను ఎంచుకోవడంలో టైమ్-లాప్స్ ఇంక్యుబేషన్ ఉపయోగించబడుతుంది.


సాధారణ IVF పద్దతి లో, వైద్య నిపుణులు ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న పిండాలను మైక్రోస్కోప్‌లో తనిఖీ చేస్తాడు, ఇందులో కొద్దికాలం పాటు వాటిని ఇంక్యుబేటర్ నుండి తొలగించడం ఉంటుంది.


టైమ్-లాప్స్ ఇంక్యుబేషన్ ద్వారా పిండాల యొక్క ప్రతి కదలికను వేలకొద్దీ చిత్రాలను తియ్యడం జరుగుతుంది. దీని అర్థం పిండాలను ఇంక్యుబేటర్ నుండి తొలగించాల్సిన అవసరం లేదు, ఇది తల్లిదండ్రులు తమ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటిని వీడియో రూపంలో చూసుకొనే అద్భుతమైన అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా ఈ టెక్నాలజీ గర్భధారణ రేటును మెరుగు పరుస్తుంది.ఈ చికిత్స యాడ్-ఆన్ సురక్షితమేనా?

టైమ్-లాప్స్ ఇమేజింగ్, ఫెర్టిలిటీ చికిత్స చేయించుకుంటున్న వ్యక్తికి లేదా ఫెర్టిలిటీ చికిత్స ఫలితంగా జన్మించిన ఏ బిడ్డకైనా ఎటువంటి ప్రమాదాన్ని, సమస్యని కలిగించదు.


భద్రత మరియు ప్రమాదాల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ నిర్దిష్ట వైద్య చరిత్ర మరియు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మీరు ఉపయోగించేందుకు చికిత్స సురక్షితంగా ఉందో లేదో మా ఫెర్టిలిటీ నిపుణులుతో చర్చించగలరు.

1 view0 comments